Posts

Showing posts with the label గాలి శుద్ధి

మీ పంటలు గాలిని శుభ్రపరుస్తున్నాయా? ఆక్సిజన్ vs హానికర గ్యాస్‌లు – రైతు తెలుసుకోవాల్సిన నిజాలు

Image
రైతు తమ కుటుంబ ఆహారం కోసం పంట సాగు చేస్తూనే ప్రకృతి లో ఉన్న వాయు కాలుష్యన్నీ  నియంత్రించగలడని నా అభిప్రాయం. మరే ఇతర రంగాల వారు చెయ్యలేని పని రైతు మాత్రమే చెయ్యగలడు. రైతుకు పంట అంటే దిగుబడి, ఆదాయం, కుటుంబ జీవనం. కానీ చాలా మంది గమనించని విషయం ఏమిటంటే — పంటలు మనం పీల్చే గాలిని కూడా ప్రభావితం చేస్తాయి. ప్రతి పచ్చ మొక్క ఫోటోసింథసిస్ ప్రక్రియలో కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అదే సమయంలో, కొన్ని సాగు పరిస్థితుల వల్ల మీథేన్ (CH₄), నైట్రస్ ఆక్సైడ్ (N₂O) వంటి గ్యాస్‌లు కూడా ఉత్పత్తి అవుతాయి. అంటే, రైతు పొలం ఒక చిన్న “గాలి వ్యవస్థ” లాంటిది. 🌿 ఎక్కువ ఆక్సిజన్ విడుదల చేసే పంటలు / చెట్లు : ఎక్కువ ఆకులు, వేగంగా పెరుగుదల, అధిక ఆకుపచ్చ భాగం ఉన్న మొక్కలు సాధారణంగా ఎక్కువ O₂ విడుదల చేస్తాయి. వెదురు  – వేగంగా పెరిగి దట్టమైన ఆకుపచ్చను ఇస్తుంది. వేప  –  గాలి శుద్ధి లక్షణాలు ఉన్న చెట్టు. రావి చెట్టు – పెద్ద ఆకులు, గాలి మార్పిడి అధికం. మర్రి చెట్టు – విస్తారమైన ఆకుదళాలు. అరటి చెట్టు – పెద్ద ఆకులు, వేగంగా పెరుగుతుంది. చెరకు  – సీజన్ అంతా పచ్చదనం. విస్తారంగా సాగ...