బ్రిటిష్ పాలనలో భారతీయ రైతులు పండించిన పంటలు ఏంటో తెలుసా? ఆ సమయం లో వ్యవసాయం ఎలా ఉందో తెలుసా?
ఎవ్వరూ పరిపాలించక ముందు భారత దేశం జాతీయ ఆదాయం అన్ని దేశాల కంటే అధికంగా ఉండేది. రాజులు తమ ప్రజల పై తక్కువ సుంకాలు వసూలు చేస్తూ ప్రజల మన్నన గెలుచుకునే వారు. తరువాత మొఘల్ ల పాలనలో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు తమ పంటను వారి ఇష్టానుసారం పండించి శిస్తు చెల్లించే వారు. మొఘల్ ల తరువాత తెల్ల వారి పాలనలో 1757 నుండి 1947 సంవత్సరం వరకు భారత దేశం వీరి పాలనలో ఉండింది. ఆ సమయం లో రైతులు తమ పంటను తెల్లవారు అయిన బ్రిటిష్ వారి పరిశ్రమల కు కావాల్సి ముడి పదార్థాలు మాత్రమే పండించే విధంగా ఆజ్ఞలు బ్రిటీష్ ప్రభుత్వం జారీ చేసేది. ఈ వవిధానాల వల్ల ప్రజలు ఆర్థికంగా మరియు రోజూ వారి తిండి లేని వారిగా అయ్యారు. అదేవిధం గా ఆకలి చావులు కూడా భారత దేశంలో పెరిగాయి. అధికంగా పండించిన వాణిజ్య పంటలు: (ఇండిగో / నీలి) - మొదటి గా నీలి రంగు మందును ఎక్కువ గా పండించేలా ఆంక్షలు ఉండేవి. సరైన పంట దిగుబడి లేక సరైన పంట ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. పత్తి - ఈ సాగుకు ముఖ్యంగా గుజరాత్,బెరార్, డెక్కన్ ప్రాంత రైతులను వాడుకున్నారు.అలా పండించిన ప్రతి నీ బ్రిటీష్ వారి దేశం లో వస్త్ర పరిశ్రమలకు ఎగుమతి చేసే వారు. టీ ఆకు - ఈ పంట కొరకు అ...