Posts

Showing posts with the label Living Mulch

గడ్డి శత్రువా? మిత్రుడా? భూమి ఆరోగ్యం, రైతు లాభనష్టాలు మరియు సరైన నియంత్రణ

Image
 రైతు కి పంటలలో ప్రధాన శత్రువు ఈ కలుపు. పంట మొక్కలని ఎదగనివ్వక వాటి పోషక పదార్థాలు అన్ని తినేసి తొందరగా ఎదిగి పోతుంది.కావున రైతులు మొట్ట మొదటి గా పంట లో ఈ కలుపు తీసివేయాలి అనుకుంటాడు.అందువల్ల రైతు కు అధిక పెట్టుబడి మరియు కూలీల కొరత అనే ఇబ్బందులు పడవలసి వస్తుంది. రైతు పొలంలో గడ్డి కనిపిస్తే మొదటి ఆలోచన — “కలుపు తీసేయాలి”. ఎందుకంటే గడ్డి పంటతో పోటీ పడుతుంది, దిగుబడిని తగ్గిస్తుంది. ఇది నిజమే. కానీ గడ్డి గురించి పూర్తిగా నెగటివ్‌గా ఆలోచించడం కూడా సరైంది కాదు. ప్రకృతి దృష్టిలో గడ్డి భూమిని కాపాడే సహజ కవచం. రైతు దృష్టిలో అది అదుపులో లేకపోతే సమస్య. అంటే గడ్డి శత్రువా? మిత్రుడా? సమాధానం : ఎలా నియంత్రిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. 🌿 గడ్డి భూమికి చేసే మేలు 1) మట్టి కొట్టుకుపోకుండా కాపాడటం;వర్షం పడితే పై మట్టి పొర  సులభంగా కొట్టుకుపోతుంది. గడ్డి వేర్లు మట్టిని బిగిగా పట్టుకుని erosion తగ్గిస్తాయి. 2) సేంద్రీయ పదార్థం పెంచడం;గడ్డి ఎండిపోయి కుళ్లినప్పుడు హ్యూమస్‌గా మారి నేల సారాన్ని పెంచుతుంది. 3) తేమ నిల్వ;గడ్డి భూమి మీద కవరింగ్‌లా ఉండి ఎండ తాకిడిని తగ్గిస్తుంది. నేలలో తేమ ఎక్కువసేపు న...