Posts

Showing posts with the label Government Schemes.

రైతులకు వరం: Kisan Credit Card (KCC) ఎలా పొందాలి? వడ్డీ ఎంత? డబ్బు ఎలా తీసుకోవాలి & ఎలా చెల్లించాలి – పూర్తి గైడ్

Image
దాదాపుగా భారత దేశంలో ఉన్న రైతులకు ఇటువంటి సేవలు బ్యాంక్ ల నుంచి ప్రయోజనం పొందవచ్చు అని 90శాతం మంది రైతులకు తెలియదు. అటువంటి సమసారం మీకోసం. చూడండి మరి. రైతు జీవితంలో పెద్ద సమస్య ఏంటి అంటే పంట వేయడానికి ముందు డబ్బు అవసరం. విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీలు, డీజిల్—ఇవి అన్నీ ముందుగానే ఖర్చవుతాయి. కానీ ఆదాయం మాత్రం పంట అమ్మిన తర్వాతే వస్తుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యంత ఉపయోగకరమైన పథకం Kisan Credit Card (KCC). KCC ఒక సాధారణ లోన్ కాదు. ఇది రైతులకు అవసరమైనప్పుడు వాడుకునే loan limit. మీరు ఎంత తీసుకుంటే, ఎంత రోజులు వాడుకుంటే, ఆ మేరకే వడ్డీ పడుతుంది. సమయానికి చెల్లిస్తే వడ్డీపై subsidy కూడా ఉంటుంది. KCC అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది? Kisan Credit Card (KCC) అనేది రైతుల కోసం ప్రభుత్వం మరియు బ్యాంకులు అందించే working capital credit facility. మీ భూమి ఎకరాలు, పంట రకం ఆధారంగా బ్యాంక్ ఒక limit fix చేస్తుంది. ఉదాహరణకు ₹1,50,000 limit ఇచ్చారనుకోండి. మీకు అవసరమైనప్పుడు ₹30,000 తీసుకోవచ్చు. మరోసారి అవసరమైతే మళ్లీ తీసుకోవచ్చు. ఇది revolving limit. ఎక్కడ అప్లై చేయాలి? ఈ పథకాన్న...