Posts

Showing posts with the label Oleoresin

గుంటూరు మిర్చితో ఏమేమి తయారు చేస్తారు? | Oleoresin, Export & Food Processing Uses తెలుసా?

Image
తెలుగు రాష్ట్రాల్లో రైతులు మిర్చి నీ అధికంగా పండించి అమ్మేస్తారు. కానీ ఆ మిర్చి తో వంట లో ఉపయోగించే కారం కోసం మాత్రమే ఉపయోగించబడిద్ది అనుకుంటాడు. కానీ ఆ ఎండు మిర్చి తో అనేక పదార్థాలు తయారు చేస్తారో అవి చాలా మంది రైతులకు తెలియదు కావున నేను తెలియ చేసే ప్రయత్నం చేశా రండి. గుంటూరు మిర్చి గురించి మాట్లాడితే, చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది దాని ఘాటు, ఎరుపు రంగు, మరియు మంచి నాణ్యత. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం అయిన పంట కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి చాలా మంచి పేరు ఉంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పండే ఈ మిర్చి అనేక దేశాలకు ఎగుమతి అవుతుంది. అందుకే ఇది సాధారణ మిర్చి కాదు, ఒక ప్రత్యేకమైన వ్యవసాయ ఉత్పత్తి గా మారింది. ఈ మిర్చి ఎందుకు అంత ప్రత్యేకం అంటే, దాని రంగు, రుచి, pungency, drying quality అన్నీ చాలా బాగుంటాయి. అందువల్ల ఆహార రంగం, spice industry, export market లో దీనికి మంచి ఆదరణ ఉంటుంది. గుంటూరు మిర్చి పేరు వినగానే కొనుగోలుదారులకు  ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే ఇది స్థిరమైన నాణ్యత   కలిగిన ఎండు మిర్చి గా గుర్తింపు పొందింది. గుంటూరు మిర్చిని ఎక్కువగా కొనుగోలు చేసే ...