E20 పెట్రోల్ అంటే ఏమిటి? రైతు పంటలు ఎలా ఇంధనంగా మారుతున్నాయి?
ప్రతీ సంవత్సరం దేశంలో పెట్రోల్ వాడకం అంతకు అంతకు పెరుగుతూనే ఉంది సమాంతరంగా కాలుష్యం కూడా పెరుగుతూ వెళ్తుంది. ఈ సమస్యని తగ్గించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో వివరించే ప్రయత్నం చేశా చూడండి. ఇప్పటి వరకు మనం రైతు పండించిన పంటలు అన్నం రూపంలో మన పళ్లెంలోకి వస్తాయని మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు అదే పంటలు మన బైక్, కారు ట్యాంక్‌లోకి కూడా వెళ్తున్నాయని చాలా మందికి తెలియదు. ఇదే మార్పుకు కారణం E20 పెట్రోల్. ఇది కేవలం ఒక ఇంధన మిశ్రమం కాదు — రైతు కష్టానికి కొత్త విలువను ఇచ్చే మార్గం. భారతదేశం ప్రతి సంవత్సరం భారీగా ముడి చమురు దిగుమతి చేస్తోంది. దీనివల్ల దేశానికి విదేశీ మారకద్రవ్య వ్యయం పెరుగుతోంది. మరోవైపు గాలి కాలుష్యం కూడా పెరుగుతోంది. ఈ రెండు సమస్యలకు ఒకేసారి పరిష్కారం చూపే మార్గంగా ప్రభుత్వం ఎథనాల్ మిశ్రమ ఇంధనాలను ప్రోత్సహిస్తోంది. E20 అంటే అసలు ఏమిటి? E20 అంటే పెట్రోల్‌లో 20% ఎథనాల్ (Ethanol) కలిపిన ఇంధనం. E = Ethanol 20 = 20 శాతం మిగతా 80% పెట్రోల్ ఉంటుంది. ఎథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటల నుంచి తయారయ్యే జైవ ఇంధనం. అంటే ఇది రైతు పొలం నుంచి వచ్చిన ఇంధనం. ఈ ఎథనాల్ ...