నీరు ప్రతి ప్రదేశంలో సంవత్సరం అంతా లభిస్తే… భారత వ్యవసాయం ఎలా మారుతుంది?
రైతే రాజు అని అంటం కథ , రాజు తలుచుకుంటే రాజ్యాన్ని ఎలా అభివృద్ధి పథం లో నడిపిస్తాడో అదే విధంగా రైతు కి ఈ ఒక్క తోడు ఉంటే దేశాన్ని అభివృద్ధి పథం లో నడిపిస్తాడు అనటం లో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మనసులో ఇలా ఊహించుకోండి. దేశంలోని ప్రతి గ్రామం, ప్రతి పొలం, ప్రతి మండలం ఇలా ఎక్కడ చూసినా సంవత్సరం పొడవునా వ్యవసాయం సాగు కు నీరు అందుబాటులో ఉంది. చెరువులు ఎండిపోవడం లేదు. వర్షాలు, రుతుపవనాలు ఆలస్యమయ్యాయా, తక్కువ వర్షపాతం అనే చింత లేదు. రైతు క్యాలెండర్ ప్రకారం పంట వేస్తాడు. ఆకాశాన్ని మరియు వర్షపాతాన్ని చూసి కాదు. ఈ పరిస్థితిలో వ్యవసాయం, గ్రామీణ జీవితం, రైతుల ఆదాయం, ఆహార భద్రత ఇలా అన్ని ఎలా మారుతాయో మరింతగా చర్చిద్దాం. పంటల ప్రణాళికలో విప్లవాత్మక మార్పు : ప్రస్తుతం చాలా మంది భారత దేశంలో రైతులు వర్షాధారంగా పంటలు వేస్తున్నారు. పంట సాగుకు అవసరం అయ్యే నీరు సంవత్సరం అంతా ఉంటే, రైతు తనకు తోచిన వ్యవసాయం చేయగలడు. ఖరీఫు , రబీ అనే పరిమితి తగ్గి, సంవత్సరానికి 2–3 పంటలు సాగు చెయ్యగలడు. వరి, గోధుమలతో పాటు కూరగాయలు, పప్పులు, నూనెగింజలు, పశువుల మేత పంటలు ఇలా అన్ని ఒక చక్రంలో అమర్చుకోవచ్చు. మార్కెట్ ధర...