బ్రిటిష్ పాలనలో భారతీయ రైతులు పండించిన పంటలు ఏంటో తెలుసా? ఆ సమయం లో వ్యవసాయం ఎలా ఉందో తెలుసా?

ఎవ్వరూ పరిపాలించక ముందు భారత దేశం జాతీయ ఆదాయం అన్ని దేశాల కంటే అధికంగా ఉండేది. రాజులు తమ ప్రజల పై తక్కువ సుంకాలు వసూలు చేస్తూ ప్రజల మన్నన గెలుచుకునే వారు.

తరువాత మొఘల్ ల పాలనలో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులు తమ పంటను వారి ఇష్టానుసారం పండించి శిస్తు చెల్లించే వారు.

మొఘల్ ల తరువాత తెల్ల వారి పాలనలో 1757 నుండి 1947 సంవత్సరం వరకు భారత దేశం వీరి పాలనలో ఉండింది. ఆ సమయం లో రైతులు తమ పంటను తెల్లవారు అయిన బ్రిటిష్ వారి పరిశ్రమల కు కావాల్సి ముడి పదార్థాలు మాత్రమే పండించే విధంగా ఆజ్ఞలు బ్రిటీష్ ప్రభుత్వం జారీ చేసేది. ఈ వవిధానాల వల్ల ప్రజలు ఆర్థికంగా మరియు రోజూ వారి తిండి లేని వారిగా అయ్యారు. అదేవిధం గా ఆకలి చావులు కూడా భారత దేశంలో పెరిగాయి.




అధికంగా పండించిన వాణిజ్య పంటలు:

(ఇండిగో / నీలి) - మొదటి గా నీలి రంగు మందును ఎక్కువ గా పండించేలా ఆంక్షలు ఉండేవి. సరైన పంట దిగుబడి లేక సరైన పంట ధర లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు.

పత్తి - ఈ సాగుకు ముఖ్యంగా గుజరాత్,బెరార్, డెక్కన్ ప్రాంత రైతులను వాడుకున్నారు.అలా పండించిన ప్రతి నీ బ్రిటీష్ వారి దేశం లో వస్త్ర పరిశ్రమలకు ఎగుమతి చేసే వారు.

టీ ఆకు - ఈ పంట కొరకు అస్సాం, డార్జిలింగ్ ప్రాంతాల్లో రైతులను అధికంగా ఉపయోగించుకొన్నారు. మరియు ఈ పంటను బ్రిటన్ కు తరలించుకునేవారు.

అఫీం గసగసాలు - మసాలా దినుసులు భారత దేశంలో అధికంగానే లభించేవి, ఈ దినుసులు కూడా విదేశాలతో వ్యాపారం కోసం పండించమనే వారు. వీటిని ముఖ్యంగా చైనా తో వ్యాపారం చేసేవారు. అలాగే ఈ కోవకు చెందిన పంటలలో చెరకు,పొగాకు పంటలు కూడా ఉన్నాయి. ఇవి ఆ కాలంలో భారతీయ రైతులు బలవంతంగా పండించిన వాణిజ్య పంటలు.

రైతుల జీవనాధారం అయిన ఆహార పంటలు పరిస్థితి -

రైతులు తమ ఆహారం కోసం కనీస పంటలు అయిన వరి, గోధుమ, జొన్న, సజ్జ, రాగి, పెసలు, మినుములను కనీస స్థాయిలో కూడా పండించలేక పోయేవారు. అందువల్ల తిండి కొరత ఎదుర్కున్నారు. తిండి లేక అల్లాడి పోయే పరిస్థితిలో కూడా బ్రిటీష్ వారి ఆజ్ఞలు పాటిస్తూ వాణిజ్య పంటలు అధికంగా పండించవలసి వచ్చేది. ఈ కారణంగా భారత దేశంలో పుట్టిన పిల్లలు పౌష్టిక ఆహార లోపంతో ఉండేవారు.

పన్నుల భారము & జమీందారీ వ్యవస్థ - బ్రిటీష్ వారి పాలనలో రైతులు పై పన్నుల భారం అధికంగా ఉండేది.ఈ పన్నులను వసూలు కొరకు జమిందారీ వ్యవస్థ ఉండేది. పంటలు దిగుబడి వచ్చిన రాకపోయినా, అకాల వర్షాలు వల్ల పంట నష్టపోయిన పన్నుల విషయంలో మినహాయింపు ఉండదు.అలాగే పన్నులు చెల్లించలేని రైతుల భూములు జమిందారీ వ్యవస్త జప్తు చేసుకున్నారు. ఆ విధంగా రైతులు భూములు కోల్పోయిన సందర్భాలు ఎన్నో.

ఇండిగో రైతుల తిరుగుబాటు (1859–60) - 

ప్రపంచానికి ఇండిగో రైతుల నిరసనలు తెలిసేలా చేసిన తిరుగుబాటు ఇది.ముఖ్యంగా బెంగాల్ రైతులు ఈ నిరసనను ముందుండి నడిపించారు. భారత దేశ చరిత్రలో రైతులు చేసిన అతి పెద్ద తిరుగుబాటు.

ప్రాంతాల వారీగా పంటల విస్తరణ -  ప్రాంతాల యొక్క నేల రకాలను బట్టి పంటలను బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించేధి. అవి: బెంగాల్: ఇండిగో, జ్యూట్.   అస్సాం, దార్జిలింగ్: టీ తోటలు.  మహారాష్ట్ర, గుజరాత్: పత్తిఉత్తరప్రదేశ్, బీహార్: అఫీం, చెరకు . దక్షిణ భారతం: పొగాకు, చెరకు, వరి

ఈ మార్పుల ప్రభావం : 

ముఖ్యంగా భారత దేశ ప్రజలు కనీస ఆహారం లేక ఆకలి చావులు పెరిగాయి. కరువులు ప్రజలను చుట్టూ ముట్టాయి. శిస్తు చెల్లించ లేక రైతులు భూమి నీ కోల్పోతూ వచ్చారు. ఆర్థికంగా నలిగిపోయి పేదరికంలో కూరుకుపోయారు. వాణిజ్య పరంగా ఎగుమతులు పెరిగిన కూడా బ్రిటీష్ వారు విధించిన అధిక పన్నులు వల్ల నష్టపోయారు.

నేటి రైతులు నేర్చుకోవాల్సిన పాఠం:

ఇలాంటి దీన పరిస్థితు ల నుండి కచ్చితంగా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాణిజ్య పంటలు మరియు ఆహార పంటల మధ్య సమాంతరం ఉండేలా చూసుకోవాలి.  నీటి లభ్యత, మట్టి స్వభావం, మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని పంటల ప్రణాళిక చేసుకోవాలి.

ముగింపు

బ్రిటీష్ వారి పాలన కంటే ముందు రైతే రాజు అని ఉండగా బ్రిటీష్ వారి పాలనలో రైతులు బానిసలు ల ఉన్నారు. రైతులు తమ అవసరాలు అయిన ఆహారం మరియు ఆర్థిక పంటలను పండించలేని దీన స్థితి. ఆకాలంలో వాణిజ్య పంటలు అయిన ఇండిగో, పత్తి, టీ, అఫీం, చెరకు, పొగాకు వంటి పంటలు ఉన్న రైతు అభివృద్ధి శూన్యం. ఇన్ని ఇబ్బందులు పడినందున స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం లో రైతులకు ఇప్పటికీ పన్ను అనేది లేదు.

Comments

Post a Comment

Popular posts from this blog

గుంటూరు మిర్చితో ఏమేమి తయారు చేస్తారు? | Oleoresin, Export & Food Processing Uses తెలుసా?

AI Farming కంటే ముందే… భారత ఋషులు చెప్పిన వ్యవసాయ శాస్త్రం ఏంటో తెలుసా?!

Ai తో వ్యవసాయం ఎలా ఉంటుందో తెలుసా?