వ్యవసాయం లో AI ని ఎక్కువ గా వాడుతున్న దేశo ఎంటో తెలుసా? భారత దేశం ఏ స్థానంలో ఉందో తెలుసా?

భారత దేశంలో (AI ) కృత్రిమ మేధ వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రతి ఒక్కరు అనగా విద్యార్థులు తమ చదువుల కోసం. అలాగే సాఫ్ట్వేర్ రంగం లో కోడింగ్ కోసం వాడి అభివృద్ధి చెందుతూ ఉన్నారు.

కానీ రైతులకు AI అనేది వాడుట తెలియక ఇంకా AI ఉపయోగించుట లో వెనుకప్పడే ఉన్నారు. అందులోనూ చదువుకున్నవారు కూడా తక్కువగా ఉండటం AI వాడకం లో భారత రైతులు వెనకపడే ఉన్నారు 


 ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకే మాట మాట్లాడుతోంది — కృత్రిమ మేధ (AI).

ChatGPT, AI tools, automation, smart farming, robotics… ఇవన్నీ ప్రతి రంగంలోకి వస్తున్నాయి.

కానీ ఒక ప్రశ్న మనకు వస్తుంది: వ్యవసాయ రంగం లో కూడా వచ్చిందా అనీ?

“ప్రపంచంలో AI ఎక్కువగా వాడుతున్న దేశాలు ఏవి? భారత్ ఎక్కడ నిలుస్తుంది?”

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి 2025–26లో వచ్చిన Global AI Adoption data చాలా వివరంగా  చెబుతోంది.

📊 AI స్వీకరణం అంటే ఏమిటి?

AI స్వీకరణం అంటే:

ఒక దేశంలో పని చేసే వయస్సు ఉన్న జనాభాలో ఎంత శాతం మంది AI tools వాడుతున్నారు అన్నది.

అంటే కేవలం కంపెనీలు కాదు, సాధారణ ప్రజలు కూడా ChatGPT లాంటి AI tools వాడుతున్నారా లేదా అన్నది.

🏆 AI ఎక్కువగా వాడుతున్న టాప్ 10 దేశాలు

ఈ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలో AI ఎక్కువగా వాడుతున్న దేశాలు ఇవి:

   1. యూ ఏ ఇ (UAE )

    2. సింగపూర్ 

     3. నార్వే 

     4. ఐర్లాండ్  

      5. ఫ్రాన్స్ 

     6. స్పెయిన్ 

      7. న్యూజిలాండ్ 

     8. నెదర్లాండ్

     9. యునైటెడ్ కింగ్డమ్ (UK)

     10. ఖతర్ 

ఈ దేశాల్లో 40% నుండి 64% వరకు పని-వయస్సు ఉన్న జనాభా AI tools వాడుతున్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య.

🇮🇳 భారత్ ఏ స్థానంలో ఉంది?

ఇక్కడే ఆసక్తికర విషయం ఉంది.

భారత్‌లో టెక్నాలజీ, ఐటీ, స్టార్టప్‌లు, డెవలపర్లు చాలా ఉన్నా కూడా

AI tools వాడుతున్న జనాభా శాతం ఇంకా తక్కువగా ఉంది.

👉 ఈ డేటా ప్రకారం భారత్ ప్రపంచంలో 64వ స్థానంలో ఉంది.

👉 సుమారు 15.7% మంది మాత్రమే AI tools వాడుతున్నారు.

🤔 ఎందుకు భారత్ ర్యాంక్ తక్కువగా ఉంది?

ఇది టెక్నాలజీ లేని కారణం కాదు. కారణాలు ఇవి:

గ్రామీణ ప్రాంతాల్లో AI గురించి అవగాహన తక్కువ

సాధారణ ప్రజలకు AI ఉపయోగం తెలియకపోవడం

English/tech హద్దులు

AI ని IT వాళ్లకే అవసరం అనుకునే అబిప్రాయం 

💡 కానీ ఒక మంచి విషయం ఏమిటంటే…

భారత్‌లో AI వాడకం తక్కువగా ఉన్నా,

AI నేర్చుకునే, ఉపయోగించే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది.

అంటే — ఒకసారి ప్రజలకు AI ఉపయోగం అర్ధమైతే,

భారత్ చాలా వేగంగా Top 10లోకి రావచ్చు.

🌱 Farming, వ్యవసాయం లో AI వాడకం ఎందుకు ముఖ్యం?

AI వాడితే రైతులకు:


(Soil analysis) నేల విశ్లేషణ 

(Crop disease detection) పంటల వ్యాధులు గుర్తింపు  

వాతావరణ మార్పులు సూచన చేస్తుంది 

పంటకు సరి అయిన సమయం లో నీరు సరఫరా చేయడం

పంట దిగుబడి అంచనా వేస్తుంది

లాంటివి చాలా సులభం అవుతాయి.

ఇదే భవిష్యత్తు వ్యవసాయం (Future Farming).

విశ్లేషణ 

ప్రపంచ దేశాలు AI వాడకంలో చాలా ముందుకు వెళ్లిపోయాయి.

భారత్ ఇంకా 64వ స్థానంలో ఉన్నా, ఇది ఒక అవకాశం.

ఎందుకంటే — ఇప్పుడే AI నేర్చుకునే వాళ్లు,

రేపు అందరికంటే ముందుంటారు.

AI వాడే రైతు, AI వాడే విద్యార్థి, AI వాడే వ్యాపారి — వీరే రేపటి లీడర్స్.

Comments

Popular posts from this blog

గుంటూరు మిర్చితో ఏమేమి తయారు చేస్తారు? | Oleoresin, Export & Food Processing Uses తెలుసా?

AI Farming కంటే ముందే… భారత ఋషులు చెప్పిన వ్యవసాయ శాస్త్రం ఏంటో తెలుసా?!

Ai తో వ్యవసాయం ఎలా ఉంటుందో తెలుసా?