Ai తో వ్యవసాయం ఎలా ఉంటుందో తెలుసా?

 ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల ప్రపంచం మొత్తం మారిపోతోంది. ఇప్పుడు అది వ్యవసాయం రంగంలో కూడా ప్రారంభమైంది. రైతు గారు తన పంటలు, భూమి, నీటి వడకం, రోగలు మరియు మార్కెట్ ధరల గురించి ముందే తెలుసుకునే అవకాశం ఏఐ వల్ల వస్తోంది.

ముందు వ్యవసాయం అనేది అనుభవం మీద ఆధారంగా నడిచేది. కానీ ఇప్పుడు డేటా ఆధారంగా, సెన్సార్లు, డ్రోన్లు మరియు మొబైల్ యాప్‌ల ద్వారా ఏఐ సహాయంతో స్మార్ట్‌గా వ్యవసాయం చేయవచ్చు.

ఏఐ వల్ల రైతుకు దొరికే ముఖ్య ప్రయోజనాలు:

పంటల రోగాలు ఫోటో తీసిన వెంటనే తెలుసుకోవడం

భూమిలో నీటి అంచనా  



సేన్సార్ల ద్వారా తెలుసుకోవడం

వర్షం ఎప్పుడు పడుతుందో ఏఐ వెదర్ ప్రిడిక్షన్

ఏ పంటకు ఏ ఎరువు ఎంత వేయాలో సూచనలు

మార్కెట్‌లో ఏ ధర వస్తుందో ముందే అంచనా

ఉదాహరణకు, కొన్ని మొబైల్ యాప్‌లు ఆకు ఫోటో తీసి రోగం ఏమిటో చెబుతాయి. కొన్ని టూల్స్ సాయిల్ టెస్ట్ డేటాను విశ్లేషించి బెస్ట్ క్రాప్ సూచనలు ఇస్తాయి. డ్రోన్‌తో ఫీల్డ్ మొత్తం మానిటర్ చేయడం కూడా ఇప్పుడు సాధ్యమే.

ఇలా ఏఐ సహాయంతో వ్యవసాయం చేస్తే:

ఖర్చు తగ్గుతుంది

ఉత్పత్తి పెరుగుతుంది

సమయం సేవ్ అవుతుంది

లాస్ తగ్గుతుంది

ఇది ఫ్యూచర్ కాదు, ఇది ఇప్పుడే జరుగుతోంది.

ఈ బ్లాగ్ ద్వారా, ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో, ఏ యాప్‌లు వాడాలో, ఏ టూల్స్ ఉపయోగపడతాయో, తెలుగులో సింపుల్‌గా మీకు చెప్తాము.

ఏఐ రైతు మిత్రతో కలిసి మన వ్యవసాయాన్ని స్మార్ట్‌గా మార్చుకుందాం.

Comments

Popular posts from this blog

గుంటూరు మిర్చితో ఏమేమి తయారు చేస్తారు? | Oleoresin, Export & Food Processing Uses తెలుసా?

AI Farming కంటే ముందే… భారత ఋషులు చెప్పిన వ్యవసాయ శాస్త్రం ఏంటో తెలుసా?!