మన భారతీయ వ్యవసాయం లో కూడా Ai ! ఎక్కడ ఏలా ఉపయోగిస్తున్నారు తెలుసా?

 ఏఐ వచ్చాక మన వ్యవసాయం ఎలా మారుతుంది? ఒక రైతు చెప్పిన నిజం

“నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలో నేను ఊహించగలను … సెన్సార్ చెప్తుంది” అని మా పక్కన ఊరు రైతు చెప్పినప్పుడు నేను నిజంగా షాక్ అయ్యాను.

మన అందరం చాలా సంవత్సరాల నుండి అనుభవం ఆధారంగా చేసి వ్యవసాయం చేస్తున్నాం. కానీ ఇప్పుడు రైతులు డేటా చూసి ఫార్మింగ్ చేస్తున్నారు. దాని కోసం వాళ్ళు యూజ్ చేస్తున్న టూల్స్ ఏంటి అంటే — సెన్సార్లు, డ్రోన్లు, సాటిలైట్ ఇమేజెస్, మొబైల్ యాప్‌లు. ఇది సినిమా కాదు… మన తెలంగాణ, ఏపీలో జరుగుతున్న నిజం.

🌱 ఫసల్ సెన్సార్లతో నీళ్ళు, స్ప్రే సమయం నిర్ణయిస్తుంది

కొన్ని పంటలలో సెన్సార్లు పెట్టారు. ఇవి సాయిల్ మాయిశ్చర్, టెంపరేచర్, హ్యూమిడిటీ లెక్కిస్తుంది .             

యాప్‌లో మెసేజ్ వస్తుంది:

“ఇ రోజు ఇర్రిగేషన్ ఇవ్వాలి”

“రెండో రోజుల్లో డిసీజ్ రిస్క్ ఉంది”

గెస్ వర్క్ కాదు. డేటా బేస్ చేసి డిసిషన్.

నా అభిప్రాయంలో ఫ్రూట్స్, వెజిటబుల్స్ పెట్టిన వాళ్ళు ఇది ట్రై చేస్తే చాలా లాభం.

🚁 గరుడా ఏరోస్పేస్ డ్రోన్లతో స్ప్రే – చూస్తే అర్థం అయిపోతుంది

డ్రోన్ వచ్చి 1 ఎకరాన్ని 10 నిమిషాల్లో స్ప్రే చేసి వెళ్తుంది. కూలీ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. నీళ్ళు కూడా తక్కువ వాడుతుంది.


మన చిత్తూరు, అనంతపురం జిల్లాలో కూడా కొందరు ఎప్పటి నుండో  ఉపయోగిస్తున్నారు.

🛰️ క్రాప్‌ఇన్ సాటిలైట్ చూసి క్రాప్ హెల్త్ చెప్తుంది

ఇది ఇంకా ఆధునికం. సాటిలైట్ ఇమేజ్ చూసి క్రాప్ స్ట్రెస్, డెఫిషెన్సీ, వ్యాధి  ముందే తెలుసుకుంటారు. పెద్ద ఫార్మ్స్, ఎఫ్‌పీఓ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

📱 కిసాన్ సువిధా యాప్ ప్రతి వ్యవసాయదారుడు ఫోన్‌లో ఉండాలి

వెదుర్, మండి రేట్లు,  సలహా — ఉచితంగా దొరుకుతుంది. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.

మీరు ఇప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి?

సాయిల్ టెస్ట్ చేయండి

సెన్సార్ సిస్టమ్ గురించి తెలుసుకోండి

డ్రోన్ స్ప్రేయింగ్ ఒకసారి ప్రయ ప్రయత్నించడo చేయండి

యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

స్టెప్ బై స్టెప్ వెళ్తే ధర కూడా అందుబాటులో ఉంటుంది .

ఒక ప్రశ్న మీకు…

మీరు ఇప్పటి వరకు నీళ్ళు ఎప్పుడు ఇవ్వాలో ఎలా నిర్ణయిస్తున్నారు? క్యాలెండర్ చూసి? లేదా సాయిల్ చూసి? ఒకసారి డేటా చూసి ప్రయత్నిస్తే తేడా మీరే చూస్తారు.

ముగింపు

వ్యవసాయం అనేది ఇప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్ కూడా. స్మార్ట్‌గా అలోచించి, కొంచెం టెక్నాలజీని యాక్సెప్ట్ చేస్తే మన కష్టం తగ్గి, లాభం పెరిగే అవకాశం ఉంది.

ఈ విషయం మీకు ఉపయోగపడితే, మీ రైతు స్నేహితులతో షేర్ చేయండి.


Comments

Post a Comment

Popular posts from this blog

గుంటూరు మిర్చితో ఏమేమి తయారు చేస్తారు? | Oleoresin, Export & Food Processing Uses తెలుసా?

AI Farming కంటే ముందే… భారత ఋషులు చెప్పిన వ్యవసాయ శాస్త్రం ఏంటో తెలుసా?!

Ai తో వ్యవసాయం ఎలా ఉంటుందో తెలుసా?