రైతులు ఇంజనీర్స్ నుంచి ఎలాంటి ఆవిష్కరణలు కావాలి అని కోరుకుంటున్నారో తెలుసా?

Technology సాంకేతిక విజ్ఞానం భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతూ ఉన్న భారత దేశం లో మాత్రం వ్యవసాయ రంగం లోకి  మాత్రం సాంకేతికo గా ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ కొత్త ఆవిష్కరణలు కోసం ఇంజనీర్ మీద ఆశ తో ఉన్నారు

ప్రథమం గా కూలీలు కొరత అనేది రైతు నీ పట్టి పీడిస్తున్న సమస్య, మరియు ఎరువుల కొరత, ఎరువులు ఎంత మోతాదులో వాడలో తెలియక పోవటం. వాతావరణం అంచనా వేయలేక పంట కోల్పోయిన సందర్భాలు ఎన్నో. ఇలాంటి సమస్యలు నుండి రైతులను ఆదుకొనే సామర్థ్యం ఇంజనీర్ మేధస్సు మీదే ఆధారపడి ఉంది.....

ఇలాంటి సమయంలో రైతు మనసులో ఒక ఆశ ఉంది — తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడి వచ్చే మార్గాలు సూచిస్తారని

ఎవరైనా మా పొలానికి పనికొచ్చే యంత్రాలు తయారు చేసి కూలీల కొరత తగ్గిస్తారని..

ఆ ఆశ ఇప్పుడు ఇంజనీర్స్ మీదే ఉంది.

నీటి సమస్యకు స్మార్ట్ పరిష్కారం కావాలి

చాలా మంది రైతులు Drip irrigation వేస్తున్నారు. ఇది లాభదాయకమే కానీ,....కానీ మోటార్ ఎప్పుడు ఆన్ చేయాలి? ఎప్పుడు ఆఫ్ చేయాలి? అనేది ఇంకా మనిషి పరివేక్షణ లో మాత్రమే జరుగుతున్నది.


రైతుల ఆశ ఏమిటంటే —పాత పద్ధతి లో కాకుండా నేల తడిగా ఉంటే మోటార్ స్వయంగా ఆఫ్ అవ్వాలి. మొబైల్‌లో నుంచే కంట్రోల్ చేయగలగాలి.

పొలంలోనే మట్టి పరీక్షలు చేస్తే బాగుంటుంది అందుకోసం చిన్న పరికరం ఉంటే ఎంతో మేలు.

మట్టి పరీక్షలు కోసం sample తీసుకుని ల్యాబ్‌కి పంపడం అంత సులభం కాదు. రైతు అనుకుంటున్నాడు — చేతిలో ఒక చిన్న పరికరం ఉంటే, అదే వెంటనే నేలలో ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో చెబితే ఎంత బాగుంటుందో!

కూలీల సమస్యకు చిన్న మెషీన్లు

ఇప్పుడు కూలీ దొరకడం పెద్ద సమస్య. అందుకే రైతు ఆశిస్తున్నాడు —  AI తో నడిచే weeder ఎలా అంటే రూం లో ఫ్లోర్ క్లీన్ చేసే మెషిన్ లా, మరియు సోలార్ ఆధారం గా పని చేసే మెషిన్లు 

ఆకు ఫోటోతోనే వ్యాధి చెప్పే టెక్నాలజీ

రైతులు పంట లో ఏ వ్యాధి అనేది కచ్చితంగా తెలియకపోవటం వల్ల మార్కెట్లో దొరికే ప్రతి మందు పిచికారీ చేస్తూ ఉన్నారు. తద్వారా పెట్టుబడి అధికంగా పెరిగి అప్పుల సమస్యలో చిక్కుకుంటున్నారు .— రైతులు యొక్క  ఆశ ఏమిటంటే ఆకు కు ఫోటో తీస్తే ఏ వ్యాధో, ఏ మందు వేయాలో చెప్పే AI  tools అందుబాటులో ఉండాలి.


 వాతావరణ సమాచారం

తన గ్రామంలో వర్షం ఎప్పుడు పడుతుందో తెలిసితే రైతు పని సరిగ్గా ప్లాన్ చేసుకోగలడు. అందుకోసం AI weather report tools అభివృద్ధి చేసి రైతులు కు అందించాలి

సౌరశక్తితో వ్యవసాయం

కరెంట్ సమస్య చాలా చోట్ల ఉంది. కొన్ని ప్రాంతాల్లో కరెంట్ సరఫరా అనేదే లేదు......అందుకే Solar pump లాంటి పరికరాలు మరింత స్మార్ట్‌గా, ఆటోమేషన్‌తో రావాలని ఆశిస్తున్నారు. మరియు పశువుల నుండి పంటకు రక్షణ గా solar పెన్సింగ్ వ్యవస్థ తక్కువ ధర లో అందుబాటులోకి కావాలని రైతులు ఆశిస్తున్నారు.

డ్రోన్లతో పిచికారీ

ప్రతి రైతు తన పంటకి తడి అందించిన తర్వాత మాత్రమే మందులు పిచికారి చేస్తాడు. అలాంటప్పుడు అధిక తడి బురద వల్ల నడిచి మందులు ఎరువులు పిచికారీ చెయ్యాలంటే చాలా కష్టతరం అవుతుంది.......ఇప్పుడు చాలా చోట్ల Agricultural drone వాడకం మొదలైంది. కానీ ఇది చిన్న రైతుకి అందుబాటులోకి రావాలి అనేది ఆశ.


రైతు ఆశించే ఆవిష్కరణలు చాలా సింపుల్‌గా ఉండి పొలంలో పని చేసే, తక్కువ ఖర్చు అయ్యే, సులభంగా వాడగలిగే పరికరం ఇవ్వండి”

ఇంజనీర్స్ ఈ దిశగా ఆలోచిస్తే, రైతు జీవితంలో నిజమైన మార్పు తీసుకురాగలరు. అలాగే వ్యవసాయ రంగం లో భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది.

Comments

Popular posts from this blog

గుంటూరు మిర్చితో ఏమేమి తయారు చేస్తారు? | Oleoresin, Export & Food Processing Uses తెలుసా?

AI Farming కంటే ముందే… భారత ఋషులు చెప్పిన వ్యవసాయ శాస్త్రం ఏంటో తెలుసా?!

Ai తో వ్యవసాయం ఎలా ఉంటుందో తెలుసా?