(El Nino) ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గితే రైతులు ఏం చేయాలి? AI ఎలా సహాయపడుతుంది?

ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలలో నైరుతి రుతుపవనాలు వల్ల తొలకరి జల్లులు భారత దేశాన్ని పలకరించేవి. కానీ ఈ సంవత్సరం ఎల్ నినో అనే వాతావరణ మార్పు వల్ల నైరుతి రుతుపవనాలు లేనట్లే  అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 

అసలు ఎల్ నినో(el nino) అంటే ఏమిటి? 

సాధారణంగా ఫాసిక్ మహా సముద్రం ఉపరితల నీరు సాధారణం కన్నా ఎక్కువగా వేడి అవ్వడం వల్ల,ఆ సముద్రం మీదుగా వచ్చే గాలులు మేఘాలు ఏర్పరచలేక పోవడం అందు వల్ల వర్షాలు తగ్గి ఎండకాల రోజులు ఎక్కువ ఉంటా ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఈ  ప్రభావం వల్ల భారతదేశంలో వర్షాలు తగ్గి, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయం చేసే రైతులకు ఇది పెద్ద సవాలు అని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ పరిస్థితిలో ఆధునిక సాంకేతిక విజ్ఞానం మరింత సూచన ప్రాయంగా ఉంటుంది, ముఖ్యంగా AI (Artificial Intelligence), రైతులకు ముందస్తు హెచ్చరికలు ఇచ్చి పంట ప్రణాళికలో సహాయపడుతుంది.

భారత్ రుతుపవనాల పై  ప్రభావం: గతంలో ఇలా 22 సార్లు ఎల్ నినో పరిస్థితులను భారత దేశం ఎదుర్కొంది.భారత్‌లో వర్షాలు ప్రధానంగా నైరుతి రుతుపవనాలు మీద ఆధారపడి ఉంటాయి. El Niño సంవత్సరాల్లో:

వర్షపాతం తగ్గుతుంది,ఎండలు, వేడి గాలులు పెరుగుతాయి.నీటి కొరత ఏర్పడుతుంది.

భారత దేశంలో ఎక్కువ నష్టపోయే పంటలు:

వరి - ఈ పంటకు అధికo గా నీరు అవసరం అవుతుంది వర్షాలు తగినంత లేనందున పంట ముఖ్య దశల్లో నీటి కొరత ఉండే పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

చెరకు - ఈ పంటకు అధికo గా నీరు అవసరం 

పత్తి - ఈ పంటకు మొలక దశలో నీరు ఉండి మొక్క దశల్లో వర్షాలు అనేవి ఉండక పోవచు. ఆ విధంగా ప్రత్తి రైతులు నష్టపోవచ్చు.

అలాగే.సోయాబీన్ (Soybean),మొక్కజొన్న ఇవి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు.

ఇలాంటి ప్రతకూల సమయం లో కూడా అధిక దిగుబడి ఇచ్చే పంటలను వ్యవసాయ శాఖ కొన్ని పంటలను సూచింది 

తక్కువ నష్టంతో పండే పంటలు

జొన్న , సజ్జ , రాగి , పెసలు, మినుములు వేరుశెనగ.

AI రైతులకు ఎలా సహాయపడుతుంది?

AI ఆధారిత వాతావరణన్ని ముందుగానే వర్షాభావాన్ని అంచనా వేస్తాయి. ఉపగ్రహ సమాచారం, గత వాతావరణ సమాచారం ఆధారంగా:

ఎప్పుడు విత్తాలి? ఏ పంట వేయాలి?   ఎంత నీరు అవసరం?   డ్రిప్ ఇరిగేషన్ అవసరమా? వంటి సూచనలు ఇవ్వగలవు.

రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తక్కువ సమయంలో పండే పంటలను ఎంచుకోవాలి.

నీటి కొరత లేకుండా ఉండే లా Drip irrigation & mulching వాడాలి

మొదటి వర్షం వచ్చిన వెంటనే విత్తనాలు విత్తుకోవాలి

చిరు ధాన్యం పంటల వైపు మారాలి

చిన్న faram pond ద్వారా నీటి నిల్వ చేసుకోవాలి

El Niño ప్రభావం వర్షాలను తగ్గించినా, సాంకేతిక పరిజ్ఞానం మరియు సరైన పంట ప్రణాళికతో రైతులు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. AI సహాయంతో ముందస్తు హెచ్చరికలు తీసుకుని పంటలను మార్చుకోవడం ఈ కాలంలో అత్యవసరం.

రైతులు ప్రకృతి మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని వినియోగిస్తే వ్యవసాయం మరింత స్థిరంగా ఉంటుంది.

అలాగే ఈ ఎల్ నినో ప్రభావం భారత దేశంలో ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.

అత్యధిక మంది పాఠకులు చదివిన స్టోరీ : మన ఋషులు వ్యవసాయం గ్రంథం గురించి.



Comments

Popular posts from this blog

గుంటూరు మిర్చితో ఏమేమి తయారు చేస్తారు? | Oleoresin, Export & Food Processing Uses తెలుసా?

AI Farming కంటే ముందే… భారత ఋషులు చెప్పిన వ్యవసాయ శాస్త్రం ఏంటో తెలుసా?!

Ai తో వ్యవసాయం ఎలా ఉంటుందో తెలుసా?